Friday, January 15, 2010

మ్యానేజింగ్...........

మొన్నామద్య్య ఈనాడు లో చదివినట్టు గుర్తు మ్యానేజ్మెంట్ ట్రైనింగ్ కి వేరే గురువు అవసరం లేదు పిల్లలే పెద్ద మ్యానేజ్మెంట్ గురువులు అని .నాకు ఇప్పుడు అది నిజం అనిపిస్తూంది నా పిల్లల్ని చూస్తుంటే. ఎన్నిసార్లు కిందపడ్డ మళ్లి సోఫా ఎక్కడం ఆపడు ఏది కావాలన్నా దొరికేదాకా ఊరుకోడు మా చిన్నోడు .మా అమ్మాయి తనకి ఇష్టం లేకపోతే భ్రమ్మ రుద్రులు వచ్చిన ఆ పని చేయదు .ఇంతకి చూస్తే వాళ్ళ వయసు ఒకరిడి సంవత్సరం ఇంకొకరిది రెండునర్ర ఏళ్ళు .వాల్లిదరిని మేనేజ్ చేయటం పెద్డ మ్యన్నేజింగ్ టాస్కే సుమా. మా వారు వుడికిస్తుంటారు నీకు వేరే ట్రైనింగ్స్ అవసరం లేదు రచనా నువ్వు ఇంట్లోనే వున్నా ని బ్రెయిన్ షార్ప్ గా ఉంచుతారు మన పిల్లలు అని .

No comments:

Post a Comment