Saturday, July 17, 2010

Kensington park








ఇండియా లో మూడు రోజులు సెలవలు కలిసి వస్తే చుట్టాలింటికి వెళ్తాము లేకపోతే ఎవరన్న మన ఇంటికి వస్తారు కబుర్లు సినిమాలు ,పనమ్మాయి రాక పోతే పనులు కళ్లుముసుకొని తెరిచేలోపే సెలవలు అయిపోతాయి .అమెరికా లో మూడు రోజులు కలిసివస్తే లాంగ్ వీకెండ్ అని చాల హడావిడి చేస్తారు.ముందుగానే ప్లాన్ చేసుకుని ఏదన్న ప్లేస్ చుసిరావటం ,లేదా దేగెర లో వున్నా ఫ్రెండ్స్ అందరు కలవటం చేస్తారు.
మేమిదరం (నేను మావారు ) తొందరగా బయటకు కదిలే రకాలం కాకపోటంతో మాకు హై ప్లాన్స్ వుండవు .ఏదో సింపుల్గా ముగిస్తాం .పిల్లలకోసం ఈసారి ఒకరోజు మొత్తం బయట గడపాలని డిసైడ్ చేసాము .మేము వుండేది మిచిగాన్ లో అవడం తో చాల నదులు సర్సులు వున్నాయి .మా దేగ్గెరలో కెన్సింగ్టన్ మెట్రో పార్క్ అని ఒక పెద్ద పార్క్ కి పిసినిక్ వెళ్ళాలని డిసైడ్ చేసాం.బులెమ్మకి,బులోడికి స్విమింగ్డ్రేస్స్లు కొన్నాం .

పులిహొర,దద్దొజనం ,పుచకాయ,జూసెస్ ,మంచి నీళ్లు, ఇండియా నుంచి తెచిన చాప ,పిల్లలు నిద్రపోతేపడుకొపెట్టటానికి మెత్తటి దుప్పటి ,అందరికి చలవ కళ్ళద్దాలు ,సుర్యరసిమి నుంచి రక్షణ కోసం సన్ బ్లాక్ క్రీం .మొత్తం బందోబస్తుతో తయ్యరయ్యాం .తమ్ముడు కానీ తమ్ముడు (తముడి ఫ్రెండ్) వస్తే తనని కూడా తీసుకొని బయలుదేరం.పార్క్ చాలా పెద్దది .నాలుగు వేల నలుగువందల ఎకరల విస్తిర్నంలొ కెంట్ లేక్ ,చిన్న ఫార్మ్,గొల్ఫ్ కొర్స్ ,నేచర్ ట్రైల్స్ ,ఫిషింగ్,బోటింగ్ ,పిక్నిక్ స్పొత్స్ థొ చాలా బాగుంది . ముందు పిక్నిక్ స్పాట్ లో సెటిల్ అయ్యి తరువాత ఈవెనింగ్ మిగతా పార్క్ చుడచు అని ముందు పిక్నిక్ స్పాట్ కోసం వెతికాము ,ఎందుకంటే పొద్దున్న పది అయిన ఎండా విపరీతంగా వుంది.

చక్కని చెట్టు నిడ దొరికింది , అందులొనూ నిళ్లకి దెగ్గరగా సామాను అక్కడపెట్టేసి పిల్లకి స్వింద్రెస్స్ వేసి చలొ నీళలొకి అనివెళ్లాం తీర చుస్తె నీళ్ళుమట్టిగా అనిపించాయి.సముద్రపు నీరు అయ్తె స్వచంగ బాగుండెది.కాని మా సిసింద్రిలు ఇద్దరు నీళ్లని చూసి తెగ సంబరపడిపొయారు. వాళ్ల ఉత్త్సహం చూసాక ఆపలెకపొయాం.ఫర్లెదు నిళ్లలొకి దిగినతరువాత అంత మట్టిగ లేవు ఒక గంట నిళ్లలొ ఆడి ఇసుక(అదేలెండి) తిన్నెలు కట్టి ,మళ్లి మా పిక్నిక్ స్పొట్ కి చెరుకొని పలహరం ముగించాం . ఆ చెట్లనిడలొ చాప మీద అలా నడుంవాలిస్తె ఆహ ఎంత హాయిగ వుందొ.

Friday, July 2, 2010

Lamhe

చాలా రోజుల తరువాత తీరిగ్గా కూర్చొని చుసిన సినిమా "లమ్హే" .పాటలు నాకు చిన్నపట్టుంచి ఇష్టం కాని సినిమా చూడటం ఇప్పుడే.చాల బాగుంది.యష్ చోప్రా సినిమాలు బాగుంటాయి ,దాంట్లో కొత్తేమి లేదు కాని ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కాదుట.మ్యూజిక్ చాల చాల బాగుంది.పాట వింటే మది వీణను మిటినట్టు వుండాలి ,వినంతసేపు మరోప్రాపంచం గుర్తురాకూడదు .అదేచుసేటప్పుడు మనసును,కళ్లనుకట్టిపడేయాలిఅదే చేసారు యష్ చోప్రా .ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం ఆనంద్ భక్షి పదాలు ,లతా గారి గొంతులో ప్రాణం పోసుకున్నాయి .శ్రీదేవి ఎంత అందంగా వుందో చెప్తే అందం సిగ్గుపడుతుందేమో .
కధబాగుంది కాని అదిచేప్పిన తీరు ఇంకా బాగుంది .ఎడారి కూడా శ్రీదేవి వుంటే అంత అందంగా వుంటుందా అనిపిస్తుంది మనకి(రాజస్తాన్ ఎడారి )సినిమా చూస్తున్నపుడు .అనుపం ఖేర్ కూడా బాగా చేసారు .ప్రతి క్యారెక్టర్ ఒక శిల్పి చేతిలో ప్రాణం పోసుకున్న శిల్పంలామలిచారు ,చిన్న చిన్న డీటైల్స్ తో సహా .వాహిద రెహ్మాన్,అనిల్కపూర్ కూడా మెప్పించారు.
ప్రేమంటే మనసుకి సంబందించింది రూపానికి ,అవసారినికి,ఆకర్షణకి సంబంధం లేదని మరోసరే చెప్పకనే చెబుతుంది ఈ సినిమా .